బెజవాడ దుర్గ గుడిలో నాసిరకం సరుకుల వాడకం.. ప్రభుత్వం సీరియస్‌

రాష్ట్రంలోని మరో పవిత్ర పుణ్యక్షేత్రమపై విజయవాడ దుర్గగుడిలో.. ప్రసాదం, లడ్డూ తయారీ ఇతర వాటిల్లో నాసిరకం వస్తువులను వాడినట్లు ఆరోపణలు వచ్చాయి.

Update: 2024-09-28 11:53 GMT

దిశ, వెబ్‌డెస్క్: తిరుమల తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ జరిగడంపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతూనే ఉంది. ఈ సమయంలోనే రాష్ట్రంలోని మరో పవిత్ర పుణ్యక్షేత్రమపై విజయవాడ దుర్గగుడి(Bejawada Durga temple)లో.. ప్రసాదం, లడ్డూ తయారీ ఇతర వాటిల్లో నాసిరకం వస్తువులను వాడినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో.. బెజవాడ దుర్గమ్మ గుడికి నాసిరకం సరుకుల సరఫరాపై ప్రభుత్వం సీరియస్‌ అయింది. అలాగే గుడి ఉద్యోగులపై చర్యలకు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తుంది. నాసిరకం వస్తువులను ఉపయోగించడంపై దసరా లోపు ఉద్యోగుల పాత్రపై నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించినట్లు సమాచారం అందుతుంది. కాగా ఈ వ్యవహారంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.


Similar News