Heavy Rains:భారీ వర్షాల ఎఫెక్ట్..ఆ జిల్లాలోని ఘాట్ రోడ్లు మూసివేత
ఏపీలో రెండు రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు పడుతున్నాయి.
దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో రెండు రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో విపత్తుల నిర్వహణ శాఖ ఏపీ ప్రజలకు హెచ్చరికలు జారీ చేసిన సంగతి తెలిసిందే. కాగా రాగల 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ సంస్థ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు రావొద్దని వాతావరణ శాఖ అధికారులు సూచనలు జారీ చేశారు. అయితే భారీ వర్షాల నేపథ్యంలో అల్లూరి జిల్లాలోని ఘాట్ రోడ్లను మూసేశారు. పాడేరు, అరకు, చింతపల్లి, మారేడుమిల్లి ఘాట్‌రోడ్లను రాత్రి 7 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు క్లోజ్ చేస్తున్నట్లు కలెక్టర్ ప్రకటించారు. ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.