AP Anna canteen:‘అన్న క్యాంటీన్ల’కు ముహూర్తం ఖరారు

ఈ నెల 15వ తేదీనే అన్న క్యాంటీన్లను ప్రారంభించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.

Update: 2024-08-12 08:52 GMT

దిశ, డైనమిక్‌ బ్యూరో:ఈ నెల 15వ తేదీనే అన్న క్యాంటీన్లను ప్రారంభించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఆ రోజు కృష్ణా జిల్లా ఉయ్యూరులో సాయంత్రం 6.30 గంటలకు అన్న క్యాంటీన్‌ను సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. తర్వాత రోజు ఆగస్టు 16వ తేదీన మిగిలిన 99 క్యాంటీన్లను మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రారంభించనున్నారు. అన్న క్యాంటీన్లు ప్రారంభం వాయిదా పడుతుందని తొలుత వార్తలు వచ్చాయి. కానీ అనుకున్న సమయానికే వాటిని ప్రారంభించాలని ప్రభుత్వం యోచిస్తోంది.


Similar News