CM Chandrababu:‘పోర్టుల నిర్మాణం’..సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..?
పోర్టుల నిర్మాణం విషయంలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వం పోర్టుల నిర్మాణాన్ని ఈపీసీ పద్ధతుల్లో చేపట్టిందన్నారు.
దిశ,వెబ్‌డెస్క్: పోర్టుల నిర్మాణం విషయంలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వం పోర్టుల నిర్మాణాన్ని ఈపీసీ పద్ధతుల్లో చేపట్టిందన్నారు. ఈ క్రమంలో పోర్టులను నిర్మించే కంపెనీలకు ప్రభుత్వం గ్యారెంటీలు ఎక్కడ ఇవ్వగలదని సీఎం పేర్కొన్నారు. కానీ పోర్టుల్లో జరుగుతున్న నిర్మాణ పనులను ఆపలేం.. కాంట్రాక్టర్లను తప్పించేసి పనులు ఆపేయడం ఈ ప్రభుత్వ విధానం కాదన్నారు. ఏపీలో ఈవీ వెహికల్స్‌ను ప్రోత్సహించాలని అధికారులకు సూచించారు. ఈవీ వాహనాలకు ఛార్జింగ్ కోసం పెద్ద ఎత్తున చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఈవీ స్టేషన్ల ఏర్పాటు పై ప్రణాళికలను సీఎంకు సబ్మిట్ చేస్తానని విజయానంద్ పేర్కొన్నారు. ఈ క్రమంలో సబ్మిట్ చేయనవసరం లేదని ఆచరణలో పెట్టాలని సీఎం చంద్రబాబు చెప్పారు.