అమరావతి వాసులకు కేంద్రం గుడ్ న్యూస్... ఔటర్ రింగు రోడ్డుకు గ్రీన్ సిగ్నల్

అమరావతి వాసులకు కేంద్రం గుడ్ న్యూస్ తెలిపింది.....

Update: 2024-07-04 17:24 GMT

దిశ, వెబ్ డెస్క్: అమరావతి వాసులకు కేంద్రం గుడ్ న్యూస్ తెలిపింది. ఏపీ సీఎం చంద్రబాబు చొరవతో విజయవాడ ఈస్ట్రన్ బైపాస్ రోడ్డుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ నుంచి నిడమనూరు వరకూ ఫ్లై ఓవర్ నిర్మించేందుకు సానుకూలత వ్యక్తం చేసింది. రాజధాని ఔటర్ రింగు రోడ్డుకు కేంద్రం ఆమోదం తెలిపింది. అంతేకాదు త్వరలోనే ఉత్తర్వుల జారీ చేస్తామని కేంద్రమంత్రి నిడిన్ గడ్కరీ హామీ ఇచ్చారు.

కాగా 2014లో టీడీపీ హయాంలో అమరావతి రాజధాని చుట్టూ 189 కిలో మీటర్ల పొడువున 150 మీటర్ల వెడల్లుతో నాలుగు వరుసల్లో ఔటర్ రింగు రోడ్డు నిర్మించాలని చంద్రబాబు నిర్ణయించారు. ఈ రోడ్డు నిర్మాణానికి అటు కేంద్రం సైతం ఓకే చెప్పింది. కృష్ణా, గుంటూరు జిల్లా పరిధిలో 87 గ్రామాలను అనుసంధానం చేసేలా ఔటర్ రింగు రోడ్డును నిర్మించాలనుకున్నారు. ఇందుకోసం ఆర్‌అండ్ బీ అధికారులు ప్రతిపాదనలను సైతం సిద్ధం చేశారు. ఆర్వీ అసిసోయేట్స్‌తో డీపీఆర్‌లు కూడా తయారు చేశారు. ఈ ఔటర్ రింగు రోడ్డు నిర్మాణం కోసం 3400 హెకార్ల భూమితో పాటు భూ సేకరణకు రూ.4 వేల కోట్లు అవసరం అవుతాయని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. భూసేకరణతో పాటు ఔటర్ రింగు రోడ్డు పూర్తి నిర్మాణం కోసం మొత్తం రూ. 17,500 కోట్లు ఖర్చు అయ్యే అవకాశం ఉందని, భారత మాల ప్రాజెక్టు కింద నిధులు మంజూరు చేయాలని కేంద్రాన్ని ప్రభుత్వాన్ని కోరింది. ఇందుకు అప్పటి కేంద్రప్రభుత్వం అనుమతులు కూడా జారీ చేసింది.

అయితే 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయి వైసీపీ అధికారాన్ని చేజిక్కించుకుంది. ఆ తర్వాత ఈ ప్రాజెక్టును జగన్ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇప్పుడు కేంద్రంలోనూ, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అమరావతి ఔటర్ రింగు రోడ్డుతోపాటు విభజన హామీలపై ప్రజల్లో ఆశలు చిగురించాయి. ఈ మేరకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కృషి చేశారు. కేంద్రమంత్రులను కలిసి అమరావతి ఔటర్ రింగు రోడ్డు నిర్మాణానికి సంబంధించిన ఆవశ్యకతను వివరించారు. దీంతో కేంద్రప్రభుత్వం సానుకూలంగా స్పందింది.


Similar News