లోకో పైలట్‌ను హత్య చేసిన నిందితుడి అరెస్ట్.. వెలుగులోకి కీలక విషయాలు

విజయవాడలో గంజాయి మత్తులో లోకో పైలట్ పై దాడి చేసి హత్య చేసిన సంఘటన సంచలనంగా మారింది.

Update: 2024-10-11 07:58 GMT

దిశ, వెబ్ డెస్క్: విజయవాడలో గంజాయి మత్తులో లోకో(Marijuana intoxication) పైలట్ (loco pilot)పై దాడి చేసి హత్య చేసిన సంఘటన సంచలనంగా మారింది. కాగా ఈ ఘోరమైన సంఘటన విజయవాడ(Vijayawada) రైల్వే స్టేషన్‌లో గురువారం చోటు చేసుకుంది. దక్షిణ మధ్య రైల్వే(South Central Railway) విజయవాడ డివిజన్‌లో లోకో పైలట్‌ అయిన డి. ఎబినేజర్ డ్యూటీ టైమ్ కావడంతో గురువారం తెల్లవారుజామున రెండు గంటల సమయంలో స్టేషన్ కు వస్తున్న సమయంలో నిందితుడు ఎబినేజర్ డబ్బు కోసం దాడి చేశాడు. దీంతో లోకో పైలట్ తీవ్ర గాయాలతో అక్కడిక్కడే మృతి చెందారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు వేగవంతం చేశారు. దీంతో లోకో పైలట్ పై దాడి చేసి హత్య చేసిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం పోలీసులు విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడు ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యక్తి.. కాగా డబ్బుల కోసం ఈ హత్య చేసినట్లు గుర్తించారు. అలాగే నెల రోజుల క్రితం కూడా ఓ రైల్వే స్టేషన్ లో షాప్ యజమానిపై దాడి చేసి.. హత్య చేశారు. అక్కడి నుంచి పారిపోయి ట్రైన్ ద్వారా విజయవాడకు వచ్చినట్లు గుర్తించారు. సీసీ టీవీ ఫుటేజ్ సహాయంతో లోకో పైలట్ ను హత్య చేసిన నిందితుడిని అరెస్ట్ చేసినట్లు రైల్వే పోలీసులు(Railaway Police) తెలిపారు.


Similar News