ఆ ఇష్యూలో పవన్ కల్యాణ్‌ను పావులా వాడారు.. సీపీఐ నారాయణ హాట్ కామెంట్స్
తిరుమల లడ్డూ(Tirumala Laddu) వ్యవహారంపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ(CPI Narayana) మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
దిశ, వెబ్‌డెస్క్: తిరుమల లడ్డూ(Tirumala Laddu) వ్యవహారంపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ(CPI Narayana) మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు.. జగన్‌పై కోపాన్ని కూటమి ప్రభుత్వం లడ్డూపై చూపించిందని విమర్శించారు. ఈ ఇష్యూలో దీక్షలు చేయించి జనసేన అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan)ను పావులా వాడుకున్నారని ఎద్దేవా చేశారు. రాజకీయంగా ఆర్ఎస్ఎస్‌కు అంశం బాగా ఉపయోగపడిందని అన్నారు. ప్రత్యేక హోదాపై చంద్రబాబు మాట్లాడకుండా సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని మండిపడ్డారు. అంతేకాదు.. సారాయిని ఆదాయ వనరుగా చూడకూడదని ప్రభుత్వానికి హితవు పలికారు.
ఇదిలా ఉండగా.. తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం దేశ వ్యాప్తంగా దుమారం రేపిన సంగతి తెలిసిందే. దీనిపై రాజకీయాలకు అతీతంగా అందరూ స్పందించారు. దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు సైతం స్పందించి.. నిజానిజాలు తేల్చేందుకు స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశాలిచ్చింది. ఐదుగురు సభ్యులతో సిట్ ఏర్పాటు చేసి అందులో సీబీఐ నుంచి ఇద్దరు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇద్దరు అధికారులు, FSSAI నుంచి ఒక నిపుణుడిని ఉంచాలని సూచించింది. సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షణలో విచారణకు ఆదేశించింది. ఈ లడ్డూ వ్యవహారం పొలిటికల్ డ్రామాగా మారాలని తాము కోరుకోవడం లేదని స్పష్టం చేసింది. ఈ లడ్డూ వ్యవహారం పొలిటికల్ డ్రామాగా మారాలని తాము కోరుకోవడం లేదని స్పష్టం చేసింది. తిరుమల లడ్డూపై వచ్చిన ఆరోపణలు ప్రపంచవ్యాప్తంగా ప్రజల మనోభావాలను దెబ్బతీసే అవకాశం ఉందని పేర్కొంటూ, సిట్ దర్యాప్తును సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షిస్తారని సుప్రీంకోర్టు పేర్కొంది.