Allu Arjun:అల్లు vs మెగా ఫ్యాన్స్ పొలిటికల్ వార్..అల్లు అర్జున్‌కు ఆ పార్టీ సపోర్ట్!

ఇటీవల ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పై జనసేన ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపాయి.

Update: 2024-08-29 14:07 GMT

దిశ, వెబ్‌డెస్క్:ఇటీవల ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పై జనసేన ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపాయి. ఇది కాస్త మెగా, బన్నీ అభిమానుల మధ్య ట్వీట్ల వార్‌కు దారీ తీసింది. ఈ క్రమంలో మెగా, అల్లు ఫ్యాన్స్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఏడాది జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి(శిల్ప రవి)కి సపోర్ట్ చేయడంతో ప్రారంభం అయిన వివాదం రోజురోజుకు ముదురుతోంది. అయితే తాజాగా అల్లు అర్జున్ ఫ్యాన్స్, మెగా అభిమానుల వార్ పొలిటికల్ టర్న్ తీసుకుంది. బన్నీ వైసీపీ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం చేయడం, ఇష్టమైన వాళ్ళ దగ్గరికే వెళ్తానని చెప్పడం దుమారం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా బన్నీకి వైసీపీ ఫ్యాన్స్ సపోర్ట్ చేస్తున్నారు. ‘అల్లు రామలింగయ్య లేకపోతే మెగా ఫ్యామిలీ ఎక్కడ? అని ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబుకు పవన్ మద్దతు ఇచ్చినట్లుగానే బన్నీ తన స్నేహితుడికి సపోర్ట్ చేశారు’ అని వైసీపీ ట్విట్టర్ వేదికగా పోస్టులు పెడుతున్నారు.


Similar News