నంద్యాల విజయ డెయిరీ వద్ద..టెన్షన్ టెన్షన్!
నంద్యాలలోని విజయ డెయిరీ వద్ద ఈరోజు మధ్యాహ్నం ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
దిశ, డైనమిక్ బ్యూరో/నంద్యాల ప్రతినిధి: నంద్యాలలోని విజయ డెయిరీ వద్ద ఈరోజు మధ్యాహ్నం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి నలుగురు డెయిరీ డైరెక్టర్లతో కలిసి ఈరోజు విజయ డెయిరీ వద్దకు చేరుకున్నారు. దీంతో పోలీసులు కూడా అక్కడికి చేరారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ తనపై కక్షతో ఉద్దేశపూర్వకంగా డిఫాల్ట్ చేశారని ఆరోపించారు. చాగలమర్రి మండలం చక్రవర్తుల పల్లెలో విజయ పాల డెయిరీకి ఐదు సంవత్సరాలుగా తాను నామినేషన్ వేస్తున్నాను ఇన్ని రోజులు చూపించని బకాయిలు ఈరోజు ఎందుకు చూపిస్తున్నారు .. అని ప్రశ్నించారు.
గత ప్రభుత్వంలో వైయస్ జగన్మోహన్ రెడ్డిని అడ్డుపెట్టుకుని రెండు సంవత్సరాలు ప్రెసిడెంట్ గా లేకున్నా కూడా అధికార యంత్రాంగం అంతా అడ్డుపెట్టుకుని చైర్మన్ అవ్వడం జరిగింది అని అన్నారు. ఇవన్నీ నేను బయట పెడతానని ఉద్దేశంతో తను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. కొన్ని రోజుల కింద బోర్డు మీటింగ్ పెట్టారు డైరెక్టర్లకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు నాకు కూడా ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా సభ్యత్వం రద్దు చేశామని చెబుతున్నారు అని అన్నారు. దీనిపై మేము న్యాయస్థానానికి వెళ్లడం జరిగింది. కచ్చితంగా తీర్పు మా వైపే ఉంటుందంటుని తెలిపారు. మా తరఫున నలుగురు డైరెక్టర్లు ఉన్న వారికి ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా మీటింగ్ ఎలా జరిపారని తెలిపారు.