సీపీఐ నారాయణ రుషికొండ పర్యటనలో ఉద్రిక్తత

విశాఖపట్నంలో ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. సీపీఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ రుషికొండ పర్యటన నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. రుషికొండ వైపు వెళ్లే అన్ని మార్గాలను మూసివేశారు.

Update: 2022-11-25 07:38 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: విశాఖపట్నంలో ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ రుషికొండ పర్యటన నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. రుషికొండ వైపు వెళ్లే అన్ని మార్గాలను మూసివేశారు. రుషికొండ మార్గంలో గతంలో ఎన్నడూ లేని విధంగా చెక్ పోస్టులను ఏర్పాటుచేసి తనిఖీలు చేపట్టారు. అయితే కోర్టు అనుమతితో సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ రుషికొండకు బయలు దేరారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణతోపాటు ఇతర నేతలతో కలిసి కారులు వెళ్తుండగా గీతం యూనివర్సిటీ జంక్షన్ వద్ద నారాయణ వాహనాన్ని పోలీసులు నిలిపివేశారు. వాహనాన్ని తనిఖీ చేశారు. రుషికొండ పర్యటనకు కేవలం నారాయణ ఒక్కరు మాత్రమే వెళ్లాలని తెగేసి చెప్పారు. కోర్టు ఆదేశాల్లో సైతం అదే ఉందని ఒక్కరు మాత్రమే వెళ్లాలని స్పష్టం చేశారు. దీంతో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణతోపాటు ఇతర నేతలను కారులో నుంచి దించేశారు. నారాయణ ఒక్కరే రుషికొండ పర్యటనకు వెళ్లాలని అనడంతో సీపీఐ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో గీతం యూనివర్సిటీ జంక్షన్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు ఏర్పాడ్డాయి. మరోవైపు పోలీసులు భారీగా మోహరించడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది.

READ MORE

అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన బాధితులకు 'జనసేన' ఆర్థికసాయం 

Tags:    

Similar News