Breaking:దళితుల ఎదుగుదలను చూడలేని సీఎం..అందుకే ఆయనపై తప్పుడు ప్రచారం
ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు వేడెక్కాయి. అధికార పార్టీకి విపక్షాలకు మధ్య పచ్చగడ్డి వేసినా భగ్గుమంటోంది.
దిశ డైనమిక్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు వేడెక్కాయి. అధికార పార్టీకి విపక్షాలకు మధ్య పచ్చగడ్డి వేసినా భగ్గుమంటోంది. ఇక ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో వైసీపీ పార్టీ ప్రతిపక్షాలపై విషప్రచారం చేయిస్తోందని టీడీపీ ఆరోపిస్తోంది. తాజాగా టీడీపీ టికెట్ పొందిన సరిపల్లి రాజేష్ కు సంబంధించిన ఓ వార్త నెట్టింట్లో చెక్కెర్లు కొడుతోంది.
అదే.. సరిపల్లి రాజేష్ దళిత ముసుగులో మహిళల్ని విదేశాలకు సప్లై చేస్తున్నారనే వార్త సోషల్ మీడియా వెదికాగా హల్చల్ చేస్తోంది. ఈ నేపథ్యంలో సరిపల్లి రాజేష్ కు సంబంధించి వస్తున్న వార్తలపై తెలుగుదేశం పార్టీ తన ట్విట్టర్ వేదికగా స్పందించింది. దళితులు పైకొస్తారంటే కుల అహంకారి జగన్ ఓర్చుకోలేడని..అందుకే టీడీపీ టికెట్ పొందిన సరిపల్లి రాజేష్ మీద ఈ రకమైన విషప్రచారం చేయిస్తున్నాడని.. ఇది జగన్ పేటీఎం గ్యాంగ్ క్రియేట్ చేసిన ఫేక్ వార్త అంటూ ట్విట్టర్ పోస్ట్ లో రాసుకొచ్చింది.
ఇక ఈ పోస్ట్ చూసిన నెటిజన్స్ వైసీపీపై కామెంట్ల రూపంలో విరుచుకుపడుతున్నారు. వైసీపీ రోజురోజుకి దిగజారి పోతోందని.. అధికారంలోనే ఉన్నారుగా, నిజంగా అతను తప్పుచేస్తే నిరూపించ వచ్చుగా అంటూ నెటిజన్స్ వైసీపీ పై కామెంట్ల రూపంలో విరుచుకుపడుతున్నారు.
దళితులు పైకొస్తారంటే కుల అహంకారి జగన్ ఓర్చుకోలేడు. అందుకే టీడీపీ టికెట్ పొందిన సరిపల్లి రాజేష్ మీద ఈ రకమైన విషప్రచారం చేయిస్తున్నాడు. ఇది జగన్ పేటీఎం గ్యాంగ్ క్రియేట్ చేసిన ఫేక్ వార్త.#YCPFakeBrathuku#2024JaganNoMore#WhyAPHatesJagan#AndhraPradesh pic.twitter.com/Z0oIADPx6x
— Telugu Desam Party (@JaiTDP) February 28, 2024