TDP: మీ ప్రశ్నకు సైకో జగనే సమాధానం చెబుతాడు.. వైసీపీకి టీడీపీ కౌంటర్

మీరు వేసిన ప్రశ్నకు సైకో జగనే(YS Jagan) సమాధానం చెబుతాడు వినండి అని తెలుగుదేశం పార్టీ(TDP Party) ట్వీట్ చేసింది.

Update: 2024-11-03 12:04 GMT
TDP: మీ ప్రశ్నకు సైకో జగనే సమాధానం చెబుతాడు.. వైసీపీకి టీడీపీ కౌంటర్
  • whatsapp icon

దిశ, డైనమిక్ బ్యూరో: మీరు వేసిన ప్రశ్నకు సైకో జగనే(YS Jagan) సమాధానం చెబుతాడు వినండి అని తెలుగుదేశం పార్టీ(TDP Party) ట్వీట్ చేసింది. పోలవరం ప్రాజెక్టు(Polavaram Project) లక్ష్యాన్ని, ఆశయాన్ని శాడిస్ట్ చంద్రబాబు(Chandrababu Naidu) నీరుగార్చేశారని, ప్రాజెక్టు ఎత్తు తగ్గించడం ద్వారా నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోతుందని, విద్యుత్ ఉత్పత్తి చేసే అవకాశం కూడా ఉండదని వైఎస్ఆర్‌సీపీ పార్టీ(YSRCP Party) ట్వీట్ చేసింది దీనికి కౌంటర్ ఇచ్చిన టీడీపీ పలు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ సందర్భంగా.. వైఎస్ జగన్ గతంలో అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలను పోస్ట్ చేసింది. దీనిపై పిచ్చోళ్ళ ప్రపంచం.. ఈ మంద మొత్తం వేరే లోకంలో ఉంటారని వ్యాఖ్యానించింది. అంతేగాక మీ కొండ బులుగు గొర్రెలకు సమాధానం, మీ పెద్ద సైకో జగనే చెప్తున్నాడు వినండి అని చెప్పింది. అలాగే మీరు ఎంత ఏడ్చినా, పోలవరం 45.72 మీటర్లకు కట్టేది.. నీళ్ళు నిలిపేది.. రాష్ట్రంలో ప్రతి ఎకరాకు నీరు ఇచ్చేది చంద్రబాబే అని స్పష్టం చేసింది. ఇక మీరు ఇలా వేరే ప్రపంచం ఒకటి సృష్టించుకుని, దాంట్లోనే బ్రతకాలని, రాష్ట్రానికి అదే మంచిదని హాట్ కామెంట్లు చేసింది.

Tags:    

Similar News