Nara Lokesh: అతనే.. ఇతను..! లోకేశ్​ను కలవడంపై కంగుతిన్న టీడీపీ నేతలు

రాష్ట్రంలోని వివిధ విద్యాసంస్థల్లో ఉన్నత విద్య అభ్యసిస్తున్న విద్యార్థుల్లో ఐటీ, అడ్వాన్స్డ్ టెక్నాలజీ నైపుణ్యాలను ప్రభుత్వం పెంపొందించడానికి ఈ రోజు సిస్కో, ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నడుమ ఒప్పందం కుదిరింది.

Update: 2025-03-25 11:01 GMT
Nara Lokesh: అతనే.. ఇతను..! లోకేశ్​ను కలవడంపై కంగుతిన్న టీడీపీ నేతలు
  • whatsapp icon

వెంటనే స్పందించిన లోకేశ్​ కార్యాలయం

అతన్ని పక్కన పెట్టాలని ఆదేశం

దిశ, డైనమిక్​ బ్యూరో: రాష్ట్రంలోని వివిధ విద్యాసంస్థల్లో ఉన్నత విద్య అభ్యసిస్తున్న విద్యార్థుల్లో ఐటీ, అడ్వాన్స్డ్ టెక్నాలజీ నైపుణ్యాలను ప్రభుత్వం పెంపొందించడానికి ఈ రోజు ప్రఖ్యాత ఐటీ సంస్థ సిస్కో, ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నడుమ ఒప్పందం కుదిరింది. రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి నారా లోకేశ్​ సమక్షాన ఉండవల్లి నివాసంలో ఇరుపక్షాల ప్రతినిధులు ఎంవోయూపై సంతకాలు చేశారు. అంతవరకు బాగానే ఉంది.. లోకేశ్​ను కలిసిన సిస్కో బృందంలో ఇప్పాల రవీంద్ర రెడ్డి అనే వ్యక్తి ఉండడం ఇప్పుడు హాట్​టాపిగ్​గా మారింది. అతను గతంలో వైసీపీ సోషల్ మీడియా లో పని చేశాడని తర్వాత గుర్తించారు. నారా భువనేశ్వరి, బ్రహ్మణి, లోకేష్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లను రాయలేని భాషలో దూషించడంతో పాటు 2017 లో ఒకసారి జైలుకు కూడా వెళ్లాడని తెలిసింది. అతను సిస్కో సేల్స్​మేనేజర్​ కావడంతో ఆ బృందంలో ఉన్నాడు. ఇతని వ్యవహారం కంపెనీ ముందుగా ప్రభుత్వానికి చెప్పకపోవడం, అలాగే ప్రభుత్వ ఇంటెలిజెన్స్ కు కూడా సమాచారం లేకపోవడంతో లోకేష్ ను కలవగలిగాడని తెలిసింది. అతనిని గుర్తించి తెలుగుదేశం పార్టీ వర్గాలు వెంటనే లోకేశ్​కార్యాలయానికి ఈ విషయాన్ని చేరవేశాయి. అసలు లోకేశ్​ను కలవడానికి ఇతనని ఎలా రానిచ్చారని ప్రశ్నించారు. కాగా.. ఈ విషయం తెలిసిన వెంటనే మంత్రి లోకేష్ కూడా సీరియస్ అయ్యారు. వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలిచ్చారు. లోకేష్ పేషీ సిబ్బంది వెంటనే స్పందించి సిస్కోకు ఘాటుగా లేఖ రాసింది. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో సిస్కో చేపట్టే ప్రాజెక్టు వ్యవహారంలో ఇప్పాల రవీంద్రారెడ్డిని పక్కన పెట్టాలని కోరింది. తాము రాసిన మెయిల్‌పై వెంటనే రెస్పాండ్ అవ్వాలని కూడా సిస్కోను లోకేష్ పేషీ కోరింది.

Tags:    

Similar News