AP News:మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ పై టీడీపీ నేత ఫైర్

మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్(Former Minister Avanthi Srinivas) నిన్న(గురువారం) వైసీపీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

Update: 2024-12-13 09:11 GMT
AP News:మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ పై టీడీపీ నేత ఫైర్
  • whatsapp icon

దిశ,వెబ్‌డెస్క్: మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్(Former Minister Avanthi Srinivas) నిన్న(గురువారం) వైసీపీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. రాజీనామా చేసిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ క్రమంలో మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్(Former CM Jagan) పై తీవ్ర విమర్శలు గుప్పించారు. కూటమి ప్రభుత్వానికి(AP Government) ఏడాది సమయం కూడా ఇవ్వకుండా విమర్శలు గుప్పిస్తున్నారు అని ఆయన మండిపడ్డారు. ఆరు నెలలకే ధర్నాలు చేద్దామని అంటున్నారని దుయ్యబట్టారు.

ఈ నేపథ్యంలో అవంతి శ్రీనివాస్ పై టీడీపీ నేత(TDP Leader) బుద్దా వెంకన్న(Budda Venkanna) విమర్శలు గుప్పించారు. అవంతి శ్రీనివాస్ ఊసరవెల్లి అని విమర్శించారు. నీ లాంటి ఊసరవెల్లిలు మాకేం సమయం ఇవ్వాల్సిన అవసరం లేదని అన్నారు. ‘ప్రజలకు తెలుసు వైసీపీ(YSRCP) ప్రభుత్వంలో నాయకులు సర్వం దోచేశారు అని, అందులో నువ్వు, వైఎస్ జగన్(YS Jagan) కూడా బాగస్వాములే. నీకు రాజకీయ జన్మనిచ్చిన చిరంజీవి గారి కుటుంబం, పవన్ కల్యాణ్ కే ద్రోహం చేశావ్. నీకు రాజకీయ పునర్జన్మ ఇవ్వడమే కాదు, గల్లీ స్థాయి వ్యక్తివైన నిన్ను ఢిల్లీలో పెట్టిన చంద్రబాబు గారిని అవమానించారు. నీ సానుభూతి ఈ కూటమి ప్రభుత్వానికి ఏమి అవసరం లేదు’’ అని బుద్దా వెంకన్న ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

Tags:    

Similar News