వరుసగా 10వ సారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న TDP నేత
టీడీపీ కీలక నేత, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. గత 50 ఏళ్లుగా రాజకీయాల్లో కొనసాగుతూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు.
దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ కీలక నేత, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. గత 50 ఏళ్లుగా రాజకీయాల్లో కొనసాగుతూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేకాదు.. వినూత్నమైన వాగ్ధాటితో ప్రత్యర్థులకు చురకలు అంటించడంలో ఆయనకు ఆయనే సాటి అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే.. ఇవాళ టీడీపీ-జనసేన అభ్యర్థుల ఉమ్మడి జాబితాను ఇరు పార్టీల అధినేతలు ప్రకటించిన విషయం తెలిసిందే.
ఈ జాబితాలో అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నుంచి చింతకాయల అయ్యన్నపాత్రుడు వరుసగా పదో సారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. 1983లో తొలిసారి ఎన్నికల బరిలోకి దిగిన ఆయన 2024లోనూ టికెట్ దక్కించుకున్నారు. 1985, 1989, 1994, 1999, 2004, 2009, 2014, 2019లో జరిగిన ఎన్నికల్లో అయ్యన్నపాత్రుడు పోటీ చేశారు. ఇందులో ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మూడుసార్లు ఓటమి పాలయ్యారు. 1996లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీగా గెలిచారు. 2024లో మరోసారి టీడీపీ తరపున నర్సీపట్నం బరిలో ఉంటున్న ఆయన గెలుస్తారా? లేదో చూడాలి.
Read More..