ఏపీలో మహిళలకు గుడ్ న్యూస్.. ఆ పథకం కింద రూ. 15 వేలు
మహిళలకు ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు గుడ్ న్యూస్ తెలిపారు...
దిశ, వెబ్ డెస్క్: మహిళలకు ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు గుడ్ న్యూస్ తెలిపారు. శ్రీకాకుళంలో మహిళలతో ముఖాముఖి అయిన ఆయన మహిళలకు టీడీపీ పుట్టినిల్లని వ్యాఖ్యానించారు. తాను తొలి నుంచి మహిళా పక్షపాతినని తెలిపారు. ప్రతి కుటుంబానికి తాను పెద్దకొడుకులా సేవ చేస్తానని చెప్పారు. అమ్మకు వంద కింద ప్రతి బిడ్డకు రూ.15 వేలు ఇస్తామని చెప్పారు. ఆడబిడ్డలను లక్షాధికారులను చేయడమే తన లక్ష్యమన్నారు. సూపర్ సిక్స్ పథకాలతో అన్ని కుటుంబాలకు భవిష్యత్తు గ్యారంటీ అని హామీ ఇచ్చారు. స్థలం లేనివాళ్లకు 2 లేదా 3 సెంట్లలో ఇళ్లు కట్టిస్తామని చెప్పారు. పేదలందరికీ ఇళ్లు కట్టిస్తామని, ఆ బాధ్యత తాను తీసుకుంటానని చంద్రబాబు తెలిపారు.
తాము అధికారంలోకి వస్తే రూ. 4 వేలు పింఛన్ అందిస్తామని చంద్రబాబు చెప్పారు. వికలాంగులకు రూ. 6 వేలు పింఛన్ ఇంటి వద్దనే 1వ తారీకునే పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. యువగళం పథకం కింద 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. జగన్ వల్ల రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం నెలకొందని, సంపద సృష్టించి అధిగమిస్తామని చెప్పారు. మే 13న జగన్‌కు దిమ్మ తిరిగే తీర్పు ఇవ్వాలని.. వైసీపీని బంగాళాఖాతంలో కలిపేయాలని మహిళలకు చంద్రబాబు కోరారు.