Buddha Venkanna: జగన్ సూత్రధారి.. అవినాశ్ పాత్రధారి

మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి పాత్రధారి అయితే సీఎం వైఎస్ జగన్ సూత్రధారి అని టీడీపీ నేత బుద్దా వెంకన్న సంచలన ఆరోపణలు చేశారు..

Update: 2023-05-25 11:57 GMT
Buddha Venkanna: జగన్ సూత్రధారి.. అవినాశ్ పాత్రధారి
  • whatsapp icon

దిశ, డైనమిక్ బ్యూరో: మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి పాత్రధారి అయితే సీఎం వైఎస్ జగన్ సూత్రధారి అని టీడీపీ నేత బుద్దా వెంకన్న సంచలన ఆరోపణలు చేశారు. దైవంలాంటి కన్నతల్లిని అడ్డం పెట్టుకుని ఎంపీ అవినాశ్ రెడ్డి డ్రామాలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు. తన తప్పు లేకపోతే సీబీఐ విచారణకు ఎందుకు డుమ్మా కొడుతున్నారని విరుచుకుపడ్డారు. మరోవైపు సీబీఐ అధికారులకు ఏపీ పోలీసులు సహకరించకపోవడం దుర్మార్గమన్నారు. రాష్ట్రానికి చెందిన పోలీసులు సహకరించని పక్షంలో ఇతర రాష్ట్రాల పోలీసులను అయినా సరే తీసుకువచ్చి ఎంపీ అవినాశ్ రెడ్డిని అరెస్ట్‌ను చేయాలని బుద్దా వెంకన్న డిమాండ్ చేశారు.

కర్నూలు ఆసుపత్రి వద్దకు కడప రౌడీలను, అవినాశ్ అనుచరులను ఎందుకు తరలించారని బుద్దా వెంకన్న నిలదీశారు. అవినాశ్‌రెడ్డిని అరెస్ట్ చేస్తారనే భయంతోనే కడప రౌడీలు, అవినాశ్ రెడ్డి అనుచరులను విశ్వభారతి ఆస్పత్రికి తరలించారంటూ మండిపడ్డారు. అవినాశ్‌రెడ్డిని అరెస్ట్ చేస్తే...సీబీఐ అధికారులపై వీరితో దాడి చేయించేందుకు కుట్ర చేస్తున్నారని టీడీపీ నేత బుద్దా వెంకన్న ఆరోపించారు.

ఇవి కూడా చదవండి: 

అవినాష్ అరెస్ట్ ఆపుతోందెవరు!?

Breaking: ఎంపీ అవినాశ్ బెయిల్‌పై విచారణ వాయిదా

Tags:    

Similar News