గుడ్ న్యూస్.. మెగా డీఎస్సీ పై మంత్రి లోకేష్ కీలక ప్రకటన
రాష్ట్రం(Andhra Pradesh)లో ఇవాళ(మార్చి 29) టీడీపీ(TDP) 43వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు.

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రం(Andhra Pradesh)లో ఇవాళ(మార్చి 29) టీడీపీ(TDP) 43వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్(NTR Bhavan)లో జరిగిన సభలో మంత్రి లోకేశ్(Minister Nara Lokesh) మాట్లాడారు. 43 ఏళ్ల ప్రయాణంలో ఎన్నో విజయాలు చూశాం. మరెన్నో సంక్షోభాలు ఎదుర్కొన్నామని తెలిపారు. ఎన్ని కష్టాలు వచ్చినా ఎత్తిన పసుపు జెండా దించని కేడర్ మనకు మాత్రమే సొంతం అని తేల్చి చెప్పారు.
కూటమి ప్రభుత్వం(AP Government) అధికారంలోకి వచ్చాక రూ.200 పెన్షన్ రూ.2000 చేశామని చెప్పారు. ఇప్పుడు రూ.4 వేల పెన్షన్ ఇస్తున్నాం అని తెలిపారు. అధికారంలోకి వచ్చిన పది నెలల్లో 117 హామీలను పూర్తి స్థాయిలో అమలు చేశామని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. ఈ క్రమంలో మరో పది రోజుల్లో మెగా డీఎస్సీ(Mega DSC) నోటిఫికేషన్ విడుదల చేస్తామని ప్రకటించారు. మే నెలలో తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలను అమలు చేస్తామని వెల్లడించారు.
కాగా విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే నాటికి 16,347 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తామని ఇప్పటికే ప్రభుత్వం చెప్పిన విషయం తెలిసిందే. ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్(Super Six) హామీల పై ప్రత్యేక దృష్టి పెట్టామని చెప్పారు. రాష్ట్రాన్ని పేదరికం లేని రాష్ట్రంగా మార్చాలని కూటమి ప్రభుత్వ లక్ష్యంగా చెప్పారు. త్వరలోనే పీ4 కార్యక్రమం కూడా ప్రారంభం కాబోతుందని మంత్రి లోకేష్ వెల్లడించారు.