Tamilnadu: చంద్రబాబుపై ఇంత అభిమానమా....!

ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్ట్‌ను పలువురు తమిళనాడు వాసులు, పలువురు నేతలు ఖండించారు..

Update: 2023-10-03 16:57 GMT

దిశ, వెబ్ డెస్క్: ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్ట్‌ను పలువురు తమిళనాడు వాసులు, నేతలు ఖండించారు. తమిళనాడులో సభ నిర్వహించి చంద్రబాబుకు సంఘీభావం తెలిపారు. చంద్రబాబు విజన్ అర్థంకాని జగన్ నిజంగా సైకో అని విమర్శించారు. చెన్నై ప్రజల దాహార్తిని తీర్చిన పుణ్యాత్ముడు చంద్రబాబు అని ప్రశ్నించారు. టీడీపీకి తమిళ ప్రజలంతా మద్దతు ఇవ్వాల్సిందేనన్నారు. చంద్రబాబు విజన్ 2020 వల్లే హైదరాబాద్ అభివృద్ధి చెందిందని చెప్పారు. చంద్రబాబు విజన్ 2047తో దేశ స్థితిగతులు మారడం ఖాయమన్నారు. స్కిల్ డెవలప్ మెంట్ పెట్టకపోతే యువతకు మంచి జరిగేదేకాదని తెలిపారు. ఐటీని తీసుకురావడం వల్లే సిలికాన్ సిటీకి సమానంగా హైదరాబాద్ ఎదిగిందని గుర్తు చేశారు. దేశ, విదేశాల్లో ఐటీ ఉద్యోగులు, విద్యార్థులందరూ చంద్రబాబుకు రుణపడి ఉంటారని పలువురు తమిళ ప్రజలు తెలిపారు.

Tags:    

Similar News