హిందీ దుమారం.. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై తమిళనాడు రియాక్షన్ ఇదే..!

హిందీ భాషపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై తమిళనాడు ప్రభుత్వం స్పందించింది...

Update: 2025-03-15 08:26 GMT

దిశ, వెబ్ డెస్క్: హిందీ భాష(Hindi Language)పై జనసేన(Janasena) పార్టీలో ఆవిర్భావ సభలో పవన్ కల్యాణ్(Pawan Kalyan) సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. హిందీ భాషను వ్యతిరేకిస్తున్న తమిళనాడు ప్రభుత్వం తమ సినిమాలను ఇతర భాషల్లో ఎందుకు డబ్ చేస్తున్నారని ప్రశ్నించారు. హిందీ వాళ్ల డబ్బులు కావాలని, కానీ ఆ భాష మాత్రం వద్దా అని ప్రశ్నించారు. హిందీ దేశ భాషని, ద్వేషించాల్సిన అవసరం లేదన్నారు. దేశానికి హిందీ, తమిళ్, తెలుగు అన్ని భాషలు కావాలని పవన్ వ్యాఖ్యానించారు.

అయితే హిందీ భాషనుద్దేశించి పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై డీఎంకే అధికార ప్రతినిధి డాక్టర్ సయీద్ హఫీజుల్లా(DMK spokesperson Dr. Syed Hafizullah) స్పందించారు. భాషా విధానంపై తమిళనాడు ప్రభుత్వం(TamilNadu Government) వైఖరిని పవన్ కల్యాణ్ తప్పుగా అర్థం చేసుకున్నారని తెలిపారు. హిందీ, ఇతర భాషలు నేర్చుకోవడానికి వ్యక్తిగతంగా తాము వ్యతిరేకం కాదని చెప్పారు. ఆ భాషలను నేర్చుకోవడం తప్పు అని తామెప్పుడూ చెప్పలేదని సయీద్ హఫీజుల్లా పేర్కొన్నారు.

Read More..

హిందీ భాషపై పవన్ వ్యాఖ్యలు.. నటుడు ప్రకాశ్ రాజ్ సంచలన ట్వీట్  

Megastar Chiranjeevi:జయకేతనం సభలో పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ స్పీచ్.. చిరంజీవి ఏమన్నారంటే?  

DMK: త్రిభాషా విధానంపై పవన్ వ్యాఖ్యలు.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన డీఎంకే 

Tags:    

Similar News