నాకు సీటుపై ఆసక్తిలేదు..ఆయనకి ఇస్తే ఒప్పుకునే ప్రసక్తే లేదు..

పైకి దోస్తీ లోపల కుస్తీ అనేలా ఉంది టీడీపీ, జనసేన పొత్తు వ్యవహారం అని రాజకీయ విశ్లేషకులు చేబుతున్నారు.

Update: 2024-02-28 05:55 GMT

దిశ డైనమిక్ బ్యూరో; పైకి దోస్తీ లోపల కుస్తీ అనేలా ఉంది టీడీపీ, జనసేన పొత్తు వ్యవహారం అని రాజకీయ విశ్లేషకులు చేబుతున్నారు. ఇరుపార్టీల అధినేతలు పొత్తుతోనే పోటీ చేస్తామని అంటున్నారు. చెప్పినట్టే పొత్తులో భాగంగా అభ్యర్థుల మొదటి జాబితా కూడా విడుదలైన విషయం అందరికి తెలిసిందే. అయితే క్షేత్ర స్థాయిలో మాత్రం ఇరుపార్టీల కార్యకర్తలు, నేతలు కత్తులు దూసుకుంటున్నారు.

ముఖ్యంగా తూర్పు గోదావరి జిల్లాలో జనసేనానికి పొత్తు సెగ తాకుతోంది. తూర్పు గోదావరి జిల్లాలోని జగ్గంపేట నియోజకవర్గ ఇంచార్జ్ గా జోతిర్ల నెహురుని  టీడీపీ అధిష్టానం కేటాయించింది. జగ్గంపేట నియోజకవర్గ సీటు టీడీపీకి ఇవ్వడంపై ఆగ్రహానికి లోనైన జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి సూర్యచంద్ర ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి నిరసన తెలుపుతున్నారు.

ఈ నేపథ్యంలో తాజాగా ఆయన మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ఐదు సంవత్సరాల నుండి ఇంటింటికి వెళ్లి గాజూ గ్లాసుకు ఓటేసి పవన్ కళ్యాణ్ గెలిపించమని ఎనిమిదిసార్లు నియోజకవర్గం మొత్తం జనసైనికులు తిరగడం జరిగిందని తెలిపారు. ఇప్పుడు జనసేనాని పవన్ కళ్యాణ్ స్పందిస్తే తమ ప్రాణాలు ఉంటాయని లేకపోతే తమ ప్రాణాలు ఉండవని పేర్కొన్నారు.

తనకి సీటు ఇవ్వమని తాను చెప్పట్లేదని.. మీరు పోటీ చేయండి లక్ష ఓట్ల మెజారిటీతో మేము గెలిపించుకుంటామని పవన్ కళ్యాణ్ న్ని కోరారు. ఇక పోటీ చేస్తే పవన్ చెయ్యాలి అంతేకానీ జోతిర్ల నెహురుని మాత్రం గెలవనియ్యం అని ధీమా వ్యక్తం చేశారు. 


 

Tags:    

Similar News