Supreme Court: వైఎస్ జగన్ బెయిల్ రద్దు పిటిషన్.. విచారణ వాయిదా
ఆస్తుల కేసులో జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్ పై విచారణ వాయిదా పడింది....
దిశ, వెబ్ డెస్క్: ఆస్తుల కేసు(Assets case)ల విషయంలో వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి(YCP chief Jagan Mohan Reddy) అరెస్ట్ అయిన 19 నెలలు జైలులో ఉండి బెయిల్‌పై విడుదలయిన విషయం తెలిసిందే. అయితే చాలా కాలంగా జగన్ బెయిల్‌పై ఉండటంతో మాజీ ఎంపీ, ఉండి ఎమ్మెల్యే రఘురామరామ కృష్ణంరాజు(Former MP and current MLA Raghuramarama Krishnamraju) అభ్యంతరం వ్యక్తం చేశారు. జగన్ బెయిల్ రద్దు(Bail Cancellation) చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు సుప్రీంకోర్టు(Supreme Court)లో పిటిషన్ దాఖలు చేశారు. ఆస్తుల కేసు విషయంలో జైలు నుంచి విడుదలైన జగన్.. సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని, షరతులను కూడా ఉల్లంఘిస్తున్నారని, అందువల్ల ఆయన బెయిల్‌ను రద్దు చేయాలని పిటిషన్‌లో కోరారు. సుప్రీంకోర్టు ఈ పిటిషన్‌పై శుక్రవారం ఉదయం విచారణ జరిపింది. ఇరువర్గాల విన్న జస్టిస్ అభయ్ ఓకా ధర్మాసనం తదుపరి విచారణ జనవరి 10కి వాయిదా వేసింది.