Supreme Court: జగన్‌ అక్రమాస్తుల కేసు.. సీబీఐ, ఈడీలకు సుప్రీం కీలక ఆదేశాలు

ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు (Raghurama Krishna Raju).. జగన్ అక్రమాస్తుల కేసు విచారణ ఆలస్యమవుతోందని పేర్కొంటూ గతంలో పిటిషన్ దాఖలు చేశారు.

Update: 2024-12-02 06:25 GMT

దిశ, వెబ్ డెస్క్: జగన్ అక్రమాస్తుల కేసుల్లో సీబీఐ (CBI), ఈడీ (ED)లకు సుప్రీంకోర్టు (Supreme Court) కీలక ఆదేశాలు జారీ చేసింది. అక్రమాస్తుల కేసుల పూర్తి వివరాలను రెండు వారాల్లోగా అందించాలని ఆదేశించింది. అలాగే కిందికోర్టులో ఉన్న డిశ్చార్జ్ పిటిషన్ల వివరాలను, తెలంగాణ హైకోర్టు (Telangana High Court)లో ఉన్న పెండింగ్ అప్లికేషన్ల వివరాలను కూడా ఇవ్వాలని ధర్మాసనం చెప్పింది. సీబీఐ, ఈడీ కేసుల వివరాలను విడివిడిగా చార్టుల రూపంలో సబ్ మిట్ చేయాలని తెలిపింది. రెండు వారాల్లో అన్ని వివరాలతో అఫిడవిట్లను దాఖలు చేయాలని పేర్కొంది.

ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు (Raghurama Krishna Raju).. జగన్ అక్రమాస్తుల కేసు విచారణ ఆలస్యమవుతోందని పేర్కొంటూ గతంలో పిటిషన్ దాఖలు చేశారు. ఆయన బెయిల్ ను రద్దు చేయడంతో పాటు, కేసు విచారణను మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరగా.. జస్టిస్ అభయ్ ఎస్ ఓకా ధర్మాసనం విచారణ చేపట్టింది. అక్రమాస్తుల కేసు విచారణ ఎందుకు ఆలస్యమవుతోందని ధర్మాసనం ప్రశ్నించగా.. డిశ్చార్జ్, వాయిదా పిటిషన్లు, ఉన్నత కోర్టుల్లో విచారణ పెండింగ్ లో ఉండటమే అందుకు కారణమని న్యాయవాదులు తెలిపారు. పెండింగ్ లో ఉన్న కేసుల వివరాలు ఇస్తే.. తదుపరి ఆదేశాలు ఇస్తామని ధర్మాసనం చెప్పింది. కాగా.. ఈ కేసు తదుపరి విచారణను జనవరికి వాయిదా వేయాలని జగన్ తరపు న్యాయవాది కోరగా.. ధర్మాసనం అందుకు నిరాకరించింది. తదుపరి విచారణను డిసెంబర్ 13కి వాయిదా వేసింది. 

Tags:    

Similar News