'ర్యాంప్' నిధులతో చిన్న తరహా పరిశ్రమలకు తోడ్పాటు : మంత్రి శ్రీనివాస్

కేంద్ర ప్రభుత్వం ర్యాంప్ పథకం కింద రూ.100 కోట్లు మంజూరు చేసిందని, వాటితో చిన్న తరహా పరిశ్రమలకు చేయూతను అందిస్తామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు.

Update: 2024-09-12 14:36 GMT

దిశ, వెబ్ డెస్క్ : కేంద్ర ప్రభుత్వం 'ర్యాంప్'(RAMP) పథకం కింద రూ.100 కోట్లు మంజూరు చేసిందని, వాటితో చిన్న తరహా పరిశ్రమలకు చేయూతను అందిస్తామని ఏపీ(AP) మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. రాష్ట్రంలో ఉన్న డ్వాక్రా సంఘాలు ఎంఎస్ఎంఈ(MSME)లు స్థాపించేలా ప్రోత్సాహిస్తామని తెలియజేశారు. భవిష్యత్తులో 50 ఎంఎస్ఎంఈ పార్కులు అభివృద్ది చేస్తామని అన్నారు. ఇక కొత్తగా ఏర్పాటైన జిల్లాల్లో జిల్లా పారిశ్రామిక కేంద్రాలను ఏర్పాటు జరుగుతోందన్నారు. ఎంఎస్ఎంఈ విధానాలపై ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు విధివిధానాలను రూపొందించారని.. త్వరలోనే ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పోరేషన్ ఏర్పాటు చేయబోతున్నట్టు ఈ సందర్భంగా మంత్రి ప్రకటించారు. 




Similar News