విశాఖ తీరంలో వింత జీవులు.. అందంగా ఉంటాయి.. కానీ తాకవద్దు
సముద్రంలో మనం ఎన్నడు చూడని అరుదైన జీవులు ఉంటాయని అందరికీ తెలిసిందే. అప్పుడప్పుడు అవి సముద్ర తీరంలో వచ్చి అందరినీ ఆశ్చర్య పరుస్తున్నాయి.
దిశ, డైనమిక్ బ్యూరో: సముద్రంలో మనం ఎన్నడు చూడని అరుదైన జీవులు ఉంటాయని అందరికీ తెలిసిందే. అప్పుడప్పుడు అవి సముద్ర తీరంలో వచ్చి అందరినీ ఆశ్చర్య పరుస్తున్నాయి. తాజాగా విశాఖ తీరంలో వింత జీవులు కనిపించాయి. ఆ జీవులు చూడటానికి చాలా అందంగా ఉన్నాయి. కానీ వాటిని తాకవద్దని నిపుణులు అంటున్నారు. ఈ రెండు వింత జీవుల పేర్లు ది బ్లూ బటన్, ది బ్లూ సీ డ్రాగన్ అని అంటారు.
ది బ్లూ సీ డ్రాగన్‌ను మముద్రపు బల్లులు అని తెలుగులో అంటారు. ఇది కుడితే తీవ్రమైన నొప్పి ఉంటుంది. ది బ్లూ సీ బటన్ శాస్త్రీయ నామం పోర్పిటా పోర్పిటా. ఇది ఒక జీవి కాదు, హైడ్రోయిడ్స్ అని పిలువబడే అనేక చిన్న జీవుల కాలనీ. ఇవి తరుచుగా విశాఖ ఆర్ కే బీచ్‌లో కన్పిస్తున్నాయి. వాటిని ప్రజలు తాకవద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాటిని తాకితే వికారం, నొప్పి, వాంతులు, చర్మ సంబంధిత లాంటి ఇతర వ్యాధులు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.