Polavaram:పట్టిసీమ ఎత్తిపోతల నుంచి నీటి విడుదల నిలిపివేత

పోలవరం మండలం, పట్టిసీమ ఎత్తిపోతల పథకం నుంచి పోలవరం ప్రాజెక్టు కుడి కాలువకు గోదావరి నీటి విడుదలను నిలిపివేసినట్లు పట్టిసీమ ఎత్తిపోతల పథకం డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు పెద్దిరాజు గురువారం సాయంత్రం తెలిపారు.

Update: 2024-08-01 15:08 GMT

దిశ,పోలవరం:పోలవరం మండలం, పట్టిసీమ ఎత్తిపోతల పథకం నుంచి పోలవరం ప్రాజెక్టు కుడి కాలువకు గోదావరి నీటి విడుదలను నిలిపివేసినట్లు పట్టిసీమ ఎత్తిపోతల పథకం డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు పెద్దిరాజు గురువారం సాయంత్రం తెలిపారు. ఈ ఏడాది జూన్ 14 నుంచి ఇప్పటి వరకు 10.3545 టీఎంసీల నీటిని కృష్ణా డెల్టాకు విడుదల చేశామన్నారు. కృష్ణా నదికి కూడా వరదలు ఉండడం వల్ల, ప్రకాశం బ్యారేజీలో నీటి నిల్వలు అధికంగా ఉన్నాయన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నీటి పంపిణీ నిలిపివేసినట్లు తెలిపారు.


Similar News