AP News:బీసీ స్టడీ సర్కిల్‌ను ప్రారంభించిన రాష్ట్ర మంత్రి
రాష్ట్రంలో వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధ్వర్యంలో బీసీ స్టడీ సర్కిల్‌ను ప్రారంభించారు.
దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధ్వర్యంలో బీసీ స్టడీ సర్కిల్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత, స్థానిక మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాద్, తిరువూరు ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ. శ్రీనివాస్ జ్యోతి ప్రజ్వలన చేసి స్టడీ సర్కిల్‌ను ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ.. విద్యార్థులు తమ ప్రతిభను పెంపొందించుకోవాలనే ఉద్దేశ్యంతో.. సీఎం చంద్రబాబు ఆదేశానుసారం బీసీ స్టడీ సర్కిల్‌ను ప్రారంభించడం జరిగిందన్నారు. స్వర్గీయ నందమూరి తారకరామారావు బడుగు బలహీన వర్గాల ఆశ జ్యోతి బీసీల అందరికీ, మహిళలకు పెద్దపీట వేశారని తెలిపారు. మహిళా విశ్వవిద్యాలయం ప్రారంభించారు అని గుర్తుచేశారు. గత ప్రభుత్వంలో ఉద్యోగాలు లేక విద్యార్థుల జీవితాలు అస్తవ్యస్తంగా మారాయని మండిపడ్డారు. రాష్ట్ర అభివృద్ధి ఉద్యోగ కల్పనే లక్ష్యంగా మెగా డిఎస్సి కోచింగ్ సెంటర్లు, అలాగే ఇప్పుడు ప్రారంభించిన బీసీ స్టడీ సివిల్ సర్వీసెస్ కోచింగ్ పొంది ఐఏఎస్‌లుగా వారి సర్వీస్ రాష్ట్ర అభివృద్ధికి దోహదం చేస్తాయి అని ఆకాక్షించారు.
తిరువూరు ఎమ్మెల్యే శ్రీనివాసరావు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ.. కొందరు ఐఏఎస్ లు మొదటి ప్రయత్నంలోనే సఫలం అవుతున్నారు, మరికొందరు కోచింగ్ లు లేకుండానే ఉత్తీర్ణత సాధిస్తున్నారు. అలాంటిది మన రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలకు లక్షల్లో ఖర్చు అవుతున్న ఐఏఎస్ కోచింగ్ ను రాష్ట్ర ప్రభుత్వం వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బీసీ స్టడీ సర్కిల్ ను ఉపయోగించుకోవాలని అన్నారు.
అనంతరం మైలవరం ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ.. నిజ జీవితంలో జరిగిన ఒక సంఘటనను సినిమా రూపంలో తీశారు. అలానే స్ఫూర్తిదాయకంగా మీరు అందరూ ఉండాలని విద్యార్థిని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. పట్టుదలతో చదివి మట్టిలోనే మాణిక్యాలు పుడతాయి.. అంతే కానీ ప్రసిద్ధి చెందిన నగరాల్లో కాదు అంటూ అద్భుతమైన సందేశాన్ని ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వివిధ కార్పొరేషన్ల ఛైర్మన్లు, శాఖ డైరెక్టర్లు, సివిల్ సర్వీసెస్ కోచింగ్ పొందుతున్న విద్యార్థిని విద్యార్థులు మరియు తదితరులు పాల్గొన్నారు.