CM చంద్రబాబు షాకింగ్ డెసిషన్.. యువ MP లావు శ్రీకృష్ణదేవరాయలకు కీలక పదవి

టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా నరసాపురం ఎంపీ లావు శ్రీకృష్ణ

Update: 2024-06-22 15:38 GMT

దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా నరసారావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలను నియమించారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన శనివారం టీడీపీ పార్లమెంటరీ పార్టీ భేటీ జరిగింది. ఈ భేటీలో టీడీపీ పార్లమెంట్ పార్టీ నేతగా లావు శ్రీకృష్ణదేవరాయలు పేరును చంద్రబాబు ఖరారు చేశారు. ఈ నెల 24 నుంచి లోక్‌సభ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వైఖరిపై ఎంపీలకు చంద్రబాబు దిశానిర్దేశం నిర్దేశం చేశారు. రాష్ట్రానికి ఎక్కువ నిధులు తీసుకొచ్చేలా ఎంపీలు కృషి చేయాలని సీబీఎన్ సూచించారు.

కాగా, టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా లావు శ్రీకృష్ణదేవరాయలను ఎంపిక చేయడం హాట్ టాపిక్‌గా మారింది. టీడీపీ సీనియర్ ఎంపీలను కాదని.. ఎన్నికలకు ముందు వైసీపీ నుండి వచ్చిన శ్రీకృష్ణదేవరాయలకు పార్లమెంటరీ పార్టీ నేతగా ఛాన్స్ ఇవ్వడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నరసారావుపేట ఎంపీ టికెట్ విషయంలో వైసీపీ అధినేత జగన్‌తో తేడాలు రావడంతో లావు శ్రీకృష్ణదేవరాయలు వైసీపీకి రాజీనామా టీడీపీలో చేరారు. టీడీపీ నుండి నరసారావుపేట ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన లావు.. వైసీపీ అభ్యర్థిపై భారీ మెజార్టీతో విజయం సాధించారు.


Similar News