Dharmana Prasada Rao: మాజీ సీఎం జగన్‌కు ఊహించని షాక్.. పార్టీకి ధర్మాన గుడ్‌బై!

రాష్ట్రంలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ (YSRCP)కి రాష్ట్ర ప్రజలు చుక్కలు చూపించారు.

Update: 2024-10-27 08:36 GMT

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ (YSRCP)కి రాష్ట్ర ప్రజలు చుక్కలు చూపించారు. ఆ పార్టీని కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితం చేస్తూ ఎవరూ ఊహించని తీర్పునిచ్చారు. దీంతో కూటమి ప్రభుత్వం అధికారాన్ని కైవసం చేసుకుంది. ఈ క్రమంలోనే వైసీపీ (YSRCP)లో ఏదో తెలియని అనిశ్చితి నెలకొంది. గ్రామాల్లో బూత్ లెవల్ కార్యకర్తల నుంచి జిల్లా నాయకులంతా వరుసగా పార్టీలు మారుతున్నారు. ఇప్పటికే పలువురు మాజీ మంత్రులు (Former Ministers), ఎంపీ (MP's)లు, ఎమ్మెల్యే (MLA's)లు సైతం టీడీపీ (TDP), జనసేన పార్టీ్ల (Janasena Paty) తీర్థం పుచ్చుకున్నారు.

ఈ క్రమంలోనే తాజాగా వైసీపీ అధినేత వైఎస్ జగన్‌ (YS Jagan)కు శ్రీకాకుళం జిల్లాల్లో ఊహించని షాక్ తగిలింది. ఆ పార్టీ సినీయర్ నేత ధర్మాన ప్రసాద రావు (Dharmana Prasad Rao) తనయుడు రామ్ మనోహర్ నాయుడు (Ram Manohar Naidu) త్వరలోనే జనసేన పార్టీ (Janasena Party)లో చేరబోతున్నట్లుగా తెలుస్తోంది. అదేవిధంగా ధర్మాన ప్రసాదరావు (Dharmana Prasada Rao) కూడా వైసీపీ (YSRCP)కి రాజీనామా చేయబోతున్నారని ప్రచారం ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఊపందుకుంది. ఆయన టీడీపీలో చేరేందుకు ఇప్పటికే ఆ పార్టీ ముఖ్య నేతలతో చర్చలు జరిపారనే టాక్ వినిపిస్తుంది. అయితే తండ్రీ, కొడకులు చేరో పార్టీలో చేరుతారా.. లేక ఏదైనా ఒకే పార్టీలో ఉంటారా అన్న విషయంపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.  


Similar News