50 ఏళ్లలో తొలిసారి.. ప‌లాస నుంచి తిరుమ‌ల‌కు30 టన్నుల జీడిప‌ప్పు

ప‌లాస నుంచి తిరుమ‌ల‌కు 30 టన్నుల జీడిప‌ప్పును ఎస్ఎస్ఎస్ ఆగ్రో ప్రొడక్ట్స్ సరఫరా చేసింది.

Update: 2024-09-26 14:27 GMT

దిశ, వెబ్ డెస్క్: తిరుమల లడ్డూ వివాదం (Tirumala Laddu Controversy) కొనసాగుతోంది. శ్రీవారి లడ్డూలో వినియోగించిన పదార్థాలు కల్తీ జరిగాయనే ఆరోపణలు వెల్లువెత్తాయి. లడ్డూ తయారీలో జంతువుల అవశేషాలు కలిశాయని నిర్ధారణ అయింది. దీంతో లడ్డూలో వినియోగించే పదార్థాల సరఫరాకు టీటీడీ (TTD) కొత్త బిడ్ వేసింది. ఈ బిడ్‌ను ఎస్ఎస్ఎస్ ఆగ్రో ప్రొడక్ట్స్(SSS Agro Products) దక్కించుకుంది. దీంతో శ్రీ‌వారి ల‌డ్డూ త‌యారీకి 30 టన్నుల జీడిప‌ప్పును ఎస్ఎస్ఎస్ ఆగ్రో ప్రొడక్ట్స్ పంపింది. జీడిప‌ప్పు వాహ‌నాన్ని కేంద్రమంత్రి కింజారపు రామ్మోహ‌న్‌నాయుడు, మంత్రి అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే గౌతు శిరీష‌ జెండా ఊపి ప్రారంభారు. 50 ఏళ్ల త‌ర్వాత తొలిసారి ప‌లాస నుంచి తిరుమ‌ల‌కు జీడిప‌ప్పు సరఫరా చేయడంతో సంస్థ అధినేత సంతోష్‌కుమార్‌ ఆనందం వ్యక్తం చేశారు. శ్రీవారి దయ వల్లే తమ సంస్థకు బిడ్ దక్కిందని తెలిపారు.


Similar News