జగన్ దెబ్బకు కంపెనీలు పరార్: గౌతు శిరీష
పరిశ్రమలను ప్రభుత్వం తరిమికొట్టిందని టీడీపీ మహిళా నేత గౌతు శిరీష అన్నారు...
దిశ, వెబ్ డెస్క్: పరిశ్రమలను ప్రభుత్వం తరిమికొట్టిందని టీడీపీ మహిళా నేత గౌతు శిరీష అన్నారు. శ్రీకాకుళంలో నిర్వహించిన ‘రా కదలి రా’ సభలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా శిరీష మాట్లాడుతూ సీఎం జగన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ పాలనలో రాష్ట్రంలోని ఏ వర్గం ప్రజలు సంతోషంగా లేరని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ప్రవేశ పెట్టిన పథకాలేవీ జగన్ కొనసాగించలేదని గుర్తు చేశారు. సీఎం జగన్ ప్రభుత్వాన్ని దించే రోజులు దగ్గర పడ్డాయన్నారు. జగన్ హయాంలో చికెన్, ఫిష్ మార్టుల్లో ఉపాధి కల్పిస్తున్నారని విమర్శించారు. పింఛన్ల పేరుతో ప్రజలను సీఎం జగన్ మోసం చేస్తున్నారని శిరీష మండిపడ్డారు. చంద్రబాబు పాలనలో అడగకుండానే పథకాలు అమలు చేశారన్నారు. తెలుగుదేశం హయాంలో ఐటీ ఉద్యోగాలు కల్పించారని టీడీపీ మహిళా నేత గౌతు శిరీష పేర్కొన్నారు.