‘అన్నం పెట్టిన చేతినే కొరికే జాతి ఇది’.. బుద్ధా వెంకన్న సంచలన ట్వీట్
ఆంధ్రప్రదేశ్‌లో కేశినేని నాని వర్సెస్ టీడీపీగా రాజకీయం మారింది. కేశినేని నాని, టీడీపీ నేతల విమర్శలు, సవాళ్లు ఏపీ పొలికటిల్ సర్కిల్స్‌లో కాక రేపుతున్నాయి.
దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్‌లో కేశినేని నాని వర్సెస్ టీడీపీగా రాజకీయం మారింది. కేశినేని నాని, టీడీపీ నేతల మధ్య విమర్శలు, సవాళ్లు ఏపీ పొలికటిల్ సర్కిల్స్‌లో కాక రేపుతున్నాయి. టీడీపీకి గుడ్ చెప్పి వైసీపీలో చేరిన విజయవాడ ఎంపీ నాని.. తెలుగుదేశం పార్టీపై, చంద్రబాబుపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. టీడీపీ, చంద్రబాబు ప్రస్తావన వస్తే నాని ఒంటి కాలిపై లేస్తున్నారు. ఈ క్రమంలోనే మరోసారి టీడీపీ, ఆ పార్టీ చీఫ్ చంద్రబాబుపై నాని ఫైర్ అయ్యారు. చంద్రబాబు దగ్గర కొన్ని ఊరకుక్కలు ఉన్నాయని.. బాబు చెప్పిన వాళ్లను విమర్శించటమే వాటి పని అని విమర్శించారు.
చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలని.. ఎలక్షన్స్‌లో ఓడిపోయాక చంద్రబాబు ఆయన సొంత రాష్ట్రం తెలంగాణకు వెళ్లడం ఖాయమని ఎద్దేవా చేశారు. కాగా, వ్యాఖ్యలపై ట్విట్టర్ వేదికగా టీడీపీ సీనియర్ లీడర్ బుద్ధా వెంకన్న స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. నానిని విమర్శిస్తూ బుద్ధా ఘాటు ట్వీట్ చేశారు. ‘‘ఈ కుక్క ఇటువైపు ఉన్నప్పుడు యజమానిపైనే అజమాయిషీ చేసేది.. అక్కడ గేట్‌కు కట్టి ఊరంతా తిప్పి మొరిగిస్తున్నారు. ఈ కుక్కను చూసి ఎగరకండి. అన్నం పెట్టిన చేతినే కొరికే జాతి ఇది. విశ్వాసం అనే లక్షణం కొంచెం కూడా ఉండదు’’ అని కేశినేని వ్యాఖ్యలకు బుద్ధా కౌంటర్‌గా ట్వీట్ చేశారు.