Breaking: నోట్ల మార్పిడి పేరుతో రూ. కోటితో ఉడాయింపు.. ఇద్దరి అరెస్ట్

మన్యం జిల్లా పార్వతీపురంలో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. నోట్ల మార్పిడి పేరుతో మోసం చేసిన ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు..

Update: 2023-06-26 16:33 GMT

దిశ, వెబ్ డెస్క్: మన్యం జిల్లా పార్వతీపురంలో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. నోట్ల మార్పిడి పేరుతో మోసం చేసిన ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. రూ.90 లక్షలు రూ.500 నోట్ల ఇస్తే రూ. కోటి విలువైన 2 వేల రూపాయల నోట్లు ఇస్తామని దుండగులు నమ్మబలికారు. దీంతో రేగిడి ఆముదాలవలసకు చెందిన ఎ. అనిల్, వి. అనిల్ అనే ఇద్దరు వ్యక్తులు ఆశ పడ్డారు. మోసం చేస్తారని ఊహించలేకపోయారు. రూ. 10 లక్షలు మిగులుతుందని అప్పు తెచ్చి మరీ డబ్బు ఇచ్చారు. ఈ డబ్బు తీసుకున్న దుండగులు.. రూ.2 వేల నోట్లతో కోటి రూపాయలు తెచ్చిస్తామని నమ్మించి పరారయ్యారు. దీంతో బాధితులు పార్వతీపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాకినాడ, భీమవరానికి చెందిన మధ్యవర్తులు చక్రపాణి, నజీమ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. నగదుతో పరారయిన వారి కోసం గాలిస్తున్నారు. 

Tags:    

Similar News