వాళ్లను నమ్మొద్దు.. మోసపోవద్దు: మంత్రి నాదెండ్ల
ధాన్యం అమ్మేందుకు దళారులను ఆశ్రయించొద్దని, వాళ్ల నమ్మి తక్కువ ధరకు అమ్మొద్దని రైతులకు మంత్రి నాదెండ్ల మనోహర్ విజ్ఞప్తి చేశారు...
దిశ, వెబ్ డెస్క్: ధాన్యం అమ్మేందుకు దళారులను ఆశ్రయించొద్దని, వాళ్ల నమ్మి తక్కువ ధరకు అమ్మొద్దని రైతులకు మంత్రి నాదెండ్ల మనోహర్(Minister Nadendla Manohar) విజ్ఞప్తి చేశారు. శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం కలిశెట్టిగూడెంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని(Grain Buying Centre) ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ రైతులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తీప్పవని హెచ్చరించారు. శ్రీకాకుళం జిల్లా(Srikakulam District)లో 5 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయబోతున్నామని ఆయన పేర్కొన్నారు. 20 శాతం వరకు తేమ ఉన్న ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ఆయన తెలిపారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ధాన్యం కొనుగోళ్లలో సంస్కరణలు తీసుకొచ్చామని చెప్పారు. రైతులు తడిచిపోకుండా రైతులకు టార్పలిన్లు అందజేస్తున్నామని మంత్రి నాదెండ్ల పేర్కొన్నారు.