మందస రోడ్ రైల్వేస్టేషన్‌లో తేనెటీగల దాడి.. 20 మందికి గాయాలు

శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గం మందస రోడ్ రైల్వేస్టేషన్‌లో తేనెటీగలు బీభత్సం సృష్టించాయి....

Update: 2024-03-21 17:23 GMT

దిశ, వెబ్ డెస్క్: శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గం మందస రోడ్ రైల్వేస్టేషన్‌లో తేనెటీగలు బీభత్సం సృష్టించాయి. భువనేశ్వర్, విశాఖ ఇంటర్ సిటీ ఎక్స్ప్రెస్ రైలు వచ్చే ముందు తేనెటీగలు ఒక్కసారిగా ప్రతాపం చూపెట్టాయి. ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు. ఇరవై మందికి గాయాలయ్యాయి. తేనెటీగల దాడితో కొంత మంది ట్రైన్ ఎక్కలేక ఫ్లాట్ ఫామ్ పైనే ఉండిపోయారు. తేనెటీగల దాడిలో గాయపడిన ప్రయాణికులకు స్థానిక ఆస్పత్రిలో చికిత్స అందించారు. 


Similar News