Kinjarapu Atchannaidu: మంత్రి అక్రమాలు బయటపెడితే అరెస్ట్ చేస్తారా?
ప్రజాస్వామ్యబద్దంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ, హౌస్ అరెస్ట్‌లతో ప్రతిపక్షం గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు...
- తప్పు చేయకపోతే భయమెందుకు?
- కళ్యాణదుర్గంలో టీడీపీ నేతల హౌస్ అరెస్ట్‌లపై అచ్చెన్నాయుడు
దిశ, డైనమిక్ బ్యూరో: ప్రజాస్వామ్యబద్దంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ, హౌస్ అరెస్ట్‌లతో ప్రతిపక్షం గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో కనగానపల్లి మండలం తూంపల్లెలో మంత్రి ఉష శ్రీచరణ్ రిసార్టు నిర్మిస్తున్న ప్రాంత పరిశీలనకు పిలుపునిస్తే టీడీపీ నాయకులను గృహనిర్బంధాలకు పాల్పడటం అమానుషమని మండిపడ్డారు. కళ్యాణదుర్గాన్ని కబ్జాల నగరంగా మార్చారని మండిపడ్డారు. సాక్ష్యాధారాలతో సహా మంత్రి అవినీతిని బయట పెట్టిన టీడీపీ నాయకులను అక్రమ అరెస్ట్‌లు చేస్తారా? అని ప్రశ్నించారు.
'తప్పు చేయకపోతే ఎందుకు భయపడాలి?, అక్రమ అరెస్ట్‌లు చేయించారంటే తప్పు చేశారని ఒప్పుకున్నట్లే?' అని ప్రశ్నించారు. 'ప్రజాధనాన్ని దోచుకునే హక్కు వైసీపీ నాయకులకు ఎవరిచ్చారు?, రాత్రింబవళ్లు కష్టపడుతున్న రైతులకు నీళ్లు ఇవ్వడం చేయగాదు కాని స్విమ్మింగ్ ఫూల్స్‌కు మాత్రం నీళ్లు ఇస్తారా?, రైతుల త్యాగాలను సొమ్ము చేసుకుంటున్న మంత్రిపై వెంటనే చర్యలు తీసుకోవాలి.' అని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి : చంద్రబాబు, లోకేష్‌కు ప్రాణహాని: మాజీ ఎమ్మెల్సీ బుద్దా సంచలన వ్యాఖ్యలు