రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. మూడు రోజుల పాటు ఈ రైళ్లు రద్దు
దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన విడుదల చేసింది. భద్రతా పనుల
దిశ, వెబ్‌డెస్క్: దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన విడుదల చేసింది. భద్రతా పనుల కారణంగా తెలుగు రాష్ట్రాల్లో తిరిగే పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. అక్టోబర్ 27 నుంచి 29వ తేదీ వరకు పలు రైళ్లను రద్దు చేసింది. వీటిల్లో డబుల్ డెక్కర్ రైలుతో పాటు పలు ప్యాసింజర్ ట్రైన్స్ ఉన్నాయి. ప్రయాణికులు ముందే గమనించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని రైల్వేశాఖ సూచించింది.
ఇక విశాఖ-విజయవాడ(22701) డబుల్ డెక్కర్ ఉదయ్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌ను 27,28వ తేదీలలో రద్దు చేశారు. ఇక రాజమండ్రి-విశాఖ(07466), విశాఖ-రాజమండ్రి(07467) ప్యాసింజర్ రైళ్లను 27,28,29వ తేదీలలో రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే స్పష్టం చేసింది.