AP Deputy CM:‘తప్పు జరిగింది.. క్షమించండి’.. పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు
తిరుపతిలో తొక్కిసలాట జరిగిన బైరాగి పట్టడంలోని పద్మావతి పార్కును డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిశీలించారు.
దిశ,వెబ్‌డెస్క్: తిరుపతిలో తొక్కిసలాట జరిగిన బైరాగిపట్టడంలోని పద్మావతి పార్కును డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిశీలించారు. ఈ తొక్కిసలాటకు గల కారణాలను అధికారులను అడిగి పవన్ కళ్యాణ్ తెలుసుకున్నారు. అధికారులు తీరుపై పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) మండిపడ్డారు. ఈ క్రమంలో అంత మంది భక్తులను ఎందుకని ఒక్కసారిగా క్యూలైన్లలోకి వదలాల్సి వచ్చిందని అధికారులను ప్రశ్నించారు. తొక్కిసలాట ఘటనలో ఆరుగురు మృతిచెందిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో తొక్కిసలాట ఘటన పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పారు. ఈ క్రమంలో అధికారులు, పోలీసులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మనుషులు చనిపోతున్నా బాధ్యతగా వ్యవహరించారా? అంటూ నిలదీశారు. సీఎం చంద్రబాబు(CM Chandrababu)కు టీటీడీ చైర్మన్, ఈవో, జేఈవో చెడ్డపేరు తీసుకువస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. వారు బాధ్యతగా ఉండి ఉంటే ఈ ఘటన జరిగేది కాదు. జరిగిన తప్పునకు ప్రజలు క్షమించాలి అని పవన్ కళ్యాణ్ కోరారు. ఈ క్రమంలో టీటీడీలో ప్రక్షాళన జరగాలి అన్నారు. టీటీడీ ఈవో, అడిషనల్ ఈవో బాధ్యత తీసుకోవాలి. శ్యామలరావు, వెంకయ్య చౌదరి విఫలమయ్యారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరగాలి. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం.. సామాన్యుల దర్శనాలపై దృష్టిపెట్టాలి పవన్ కల్యాణ్ వెల్లడించారు.