సీతారాం ఏచూరి మృతి తీరని లోటు..సంతాపం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే

సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆకస్మిక మరణం పేదలకు తీరనిలోటని గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పేర్కొన్నారు.

Update: 2024-09-12 15:16 GMT

దిశ ప్రతినిధి, గన్నవరం: సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆకస్మిక మరణం పేదలకు తీరనిలోటని గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పేర్కొన్నారు. ఆయన మృతి పట్ల యార్లగడ్డ వెంకట్రావు సంతాపం వ్యక్తం చేశారు. దేశ రాజకీయాల్లో సీతారాం అత్యంత గౌరవనీయ వ్యక్తి అని అభివర్ణించారు. కమ్యూనిస్టు పార్టీకి , దేశానికి, ఎంతో సేవ చేసిన ఏచూరి పేదల సమస్యల పరిష్కారం కోసం జరిగిన పలు ఉద్యమాలకు నాయకత్వం వహించారని, ఆయన మృతి బాధాకరమన్నారు.

ఏచూరి 1975 ఎమర్జెన్సీ సమయంలో అరెస్టు అయ్యారని గుర్తు చేశారు. పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా 2005 నుంచి 2017 వరకు రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారన్నారు. అధికారం రాదని తెలిసినా కడవరకు సీపీఎం పార్టీలోనే కొనసాగిన ఆయన నేటి తరం నాయకులకు ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. ప్రజా సమస్యల పరిష్కారానికై ప్రజా ఉద్యమాలకే తన జీవితాన్ని అంకితం చేసిన మహా యోధుడు సీతారాం ఏచూరి అన్నారు. సీతారాం ఏచూరి ఆత్మకు శాంతి చేకూరాలని ఎమ్మెల్యే యార్లగడ్డ దైవాన్ని ప్రార్థించారు.


Similar News