షర్మిలకు అన్యాయం జరిగింది: వైఎస్ విజయమ్మ

మాజీ సీఎం వైఎస్ జగన్(YS Jagan) తన కుటుంబ సభ్యులు అయిన వైఎస్ షర్మిల(YS Sharmila), విజయమ్మలకు నోటీసులు ఇవ్వడం సంచలనంగా మారింది.

Update: 2024-10-29 14:11 GMT
షర్మిలకు అన్యాయం జరిగింది: వైఎస్ విజయమ్మ
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్: మాజీ సీఎం వైఎస్ జగన్(YS Jagan) తన కుటుంబ సభ్యులు అయిన వైఎస్ షర్మిల(YS Sharmila), విజయమ్మలకు నోటీసులు ఇవ్వడం సంచలనంగా మారింది. ఈ విషయం పై విజయమ్మ (YS Vijayamma) స్పందిస్తూ.. ‘‘తన కుటుంబానికి ఏ దిష్టి తగిలిందో అర్థం కావట్లేదంటూ.. వైఎస్ఆర్ అభిమానులకు బావోద్వేగ లేఖ రాశారు. ఇందులోనే.. తన బిడ్డ షర్మిలకు అన్యాయం జరిగిందని అన్నారు. జగన్ సీఎం అయ్యాక ఆస్తులు పంపకం చేయాలని నిర్ణయం తీసుకున్నాడని తెలిపారు. ప్రస్తుతం వివాదానికి కారణమైన MOU జగన్ తన చేతితో రాసిందేనని గుర్తు చేశారు. సదరు ఆస్తులపై షర్మిలకు హక్కు ఉండటం వల్లనే రూ. 200 కోట్ల డివిడెండ్లను ఇచ్చినట్లు స్పష్టం చేశారు. అలాగే జగన్ రాసిన MOU లో ఉన్న సరస్వతి షేర్స్ 100 శాతం, అందులో లేని యలహంక ప్రాపర్టీ 100 శాతం షర్మిలకు వెంటనే ఇస్తానని మాట ఇచ్చి MOU పై సంతకం పెట్టాడు. కానీ వాటిని షర్మిలకు ఇవ్వకపోగా.. అటాచ్‌మెంట్ లో లేని ఆస్తుల విషయంలో పాపకు(షర్మిలకు) ఆన్యాయం చేశారని తన లేఖలో విజయమ్మ ఆవేదన చెందారు.


👉Also Read: Brother Anil: విజయమ్మ కూడా బాధితురాలే.. జగన్‌పై బ్రదర్ అనిల్ సంచలన వ్యాఖ్యలు 

Tags:    

Similar News