తండ్రికి నివాళులు అర్పించిన YS షర్మిల.. మళ్లీ అదే సీన్..!
దివంగత సీఎం, తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి వైఎస్ షర్మిల నివాళులర్పించారు. శనివారం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా కడప జిల్లాలోని ఇడుపులపాయకు వెళ్లిన షర్మిల..
దిశ, వెబ్డెస్క్: దివంగత సీఎం, తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి వైఎస్ షర్మిల నివాళులర్పించారు. శనివారం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా కడప జిల్లాలోని ఇడుపులపాయకు వెళ్లిన షర్మిల.. తల్లి విజయమ్మతో కలిసి తండ్రి సమాధి వద్ద నివాళులర్పించారు. అనంతరం వైఎస్ కుటుంబ సభ్యులు ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఇక, షర్మిల నివాళులు అర్పించి వెళ్లిన తర్వాత ఇడుపులపాయకు సీఎం జగన్ రానున్నట్లు సమాచారం.
గత కొంత కాలంగా వైఎస్ షర్మిలకు, జగన్కు మధ్య విభేదాలు నెలకొన్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉండగానే.. తండ్రి వర్ధంతి రోజున అన్నాచెల్లెళ్లు ఒకరినొకరు కలుసుకోకుండా.. ఒకరు వెళ్లిన తర్వాత మరొకరు వచ్చి నివాళులు ఆర్పించడం ఈ వార్తలకు మరింత బలం చేకూరుస్తుంది. దీంతో వైఎస్ వర్ధంతి సాక్షిగా మరోసారి జగన్, షర్మిల మధ్య విభేదాలు బయటపడ్డాయని ప్రచారం జరుగుతోంది. అయితే, గత వర్ధంతి సందర్భంగా కూడా సేమ్ ఇలాగే జరిగింది. తండ్రికి జగన్, షర్మిల వేర్వేరుగా నివాళులు ఆర్పించారు.