విజయనగరం రైలు ప్రమాద ఘటనలో ఏడుగురు మృతి, 40 మందికి తీవ్ర గాయాలు

విజయనగరం సమీపంలో కంటకాపల్లి వద్ద రెండు రైళ్లు ఢీకొట్టుకున్న

Update: 2023-10-29 16:17 GMT

దిశ, వెబ్‌డెస్క్: విజయనగరం సమీపంలో కంటకాపల్లి వద్ద రెండు రైళ్లు ఢీకొట్టుకున్న ఘటనలో ఏడుగురు మృతి చెందారు. అలాగే 40 మందికి గాయాలయ్యాయి. ఈ ఘటనపై ఏపీ సీఎం జగన్ స్పందించారు. రైలు ప్రమాదంపై దిగ్బ్రాంతి వ్యక్తం చేసిన జగన్.. మృతులకు సంతాపం ప్రకటించారు. అలాగే మృతుల కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. సహాయక చర్యలను ముమ్మరం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వెంటనే సహాయక చర్యలను చేపట్టాలని ఆదేశించారు.

విశాఖపట్నం, అనకాపల్లి నుంచి వీలైనన్ని అంబులెన్స్‌లు పంపించాలని ఆదేశాలు జారీ చేశారు. బాధితులకు మెరుగైన వైద్య చికిత్సలు అందించాలని ఆదేశించారు. వైద్య, పోలీస్, రెవెన్యూ, ఇతర విభాగాలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఘటనకు సంబంధించి తనకు ఎప్పటికప్పుడు  రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశించారు. 


Similar News