YS వివేకా మర్డర్ కేసులో బిగ్ ట్విస్ట్.. నిందితుల జాబితా నుండి దస్తగిరి పేరు రిమూవ్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలను కుదిపేసిన మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో మరో సంచలన పరిణామం చోటు చేసుకుంది. వివేకా మర్డర్

Update: 2024-07-25 13:49 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలను కుదిపేసిన మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో మరో సంచలన పరిణామం చోటు చేసుకుంది. వివేకా మర్డర్ కేసులో కీలక నిందితుడైన దస్తగిరి పేరును సీబీఐ కోర్టు నిందితుల జాబితా నుండి తొలగించింది. ఈ కేసులో ఇకపై దస్తగిరిని సాక్షిగా పరిగణించేందుకు కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాగా, వైఎస్ వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి తన పేరును నిందితుల జాబితా నుండి తొలగించాలని సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన కోర్టు.. దస్తగిరి అభ్యర్థనతో ఏకీభవించి అతడి పేరును నిందితుల జాబితా నుండి తొలగిస్తూ ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక నుండి వివేకా హత్య కేసులో దస్తగిరిని సాక్షిగా మాత్రమే పరిగణించనున్నారు. ఏపీలో సంచలనం రేపిన ఈ కేసులో ఐదేళ్లు జైల్లో ఉన్న దస్తగిరి అప్రూవర్‌గా మారడంతో కోర్టు అతడికి బెయిల్ మంజూరు చేసింది. ప్రస్తుతం బెయిల్‌పై బయట ఉన్న దస్తగిరి ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డిపై స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగి ఓటమి పాలైన సంగతి తెలిసిందే. 

Tags:    

Similar News