అప్పుడు వద్దు..ఇప్పుడు ముద్దు.. జగన్‌పై ఆయ్యన్న ఆగ్రహం
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు ఆగ్రహం వ్యక్తం చేశారు..
దిశ, వెబ్ డెస్క్: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. కియా పరిశ్రమ విషయంలో సీఎం జగన్ వ్యవహరించిన తీరుపై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అధికారంలోకి రాకముందు కియా పరిశ్రమను రాష్ట్రం నుంచి పంపించి వేస్తామని జగన్ చెప్పారని, ఆ తర్వాత అదే కంపెనీలో 3 వేలు ఉద్యోగాలు ఇచ్చినట్లు గొప్పలు చెప్పుకున్నారని అయ్యన్న ఎద్దేవా చేశారు. అప్పుడేమో వద్దన్నాడని, ఇప్పుడు ముద్దంటున్నారని పంచ్‌లు వేశారు. అధికారంలోకి రాకముందు ఒక మాట.. అధికారంలోకి వచ్చిన తర్వాత మరో మాట అన్న చందంగా జగన్ తీరు ఉందని విమర్శించారు. టీడీపీ హయాంలో రాష్ట్రానికి వచ్చిన కియా పరిశ్రమపై జగన్, ఆపార్టీ నేతలు వ్యవహారం మొత్తం అందరికీ తెలుసన్నారు. నాడు వ్యతిరేకించి ఇప్పుడు తమ వల్లే ఉద్యోగాలు వచ్చాయని చెబుతున్న జగన్ .. హామీల విషయంలోనూ మాట మార్చని నమ్మకమేంటని అయ్యన్న ప్రశ్నించారు. ఈ ఎన్నికల్లో జగన్ ఓటమి ఖాయమై పోయిందని, కూటమి అధికారంలోకి వస్తే జగన్ తప్పులను ప్రజల ముందు పెడతామని అయ్యన్న పాత్రుడు హెచ్చరించారు.
అప్పుడు వద్దన్నాడు.. ఇప్పుడు ముద్దంటున్నాడు. నాడు కియా పరిశ్రమను వ్యతిరేకించిన జగన్మోహన్రెడ్డి.. నేడు తమవల్లే ఉద్యోగాలు వచ్చాయంటూ గొప్పలు చెప్పుతున్నాడు #JaruguJagan #YCPAntham #JaganFalsePromises pic.twitter.com/zRrj5CqYUJ
— Ayyanna Patrudu (@AyyannaPatruduC) April 28, 2024