Dhavaleswaram Barrage:ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద రెండవ ప్రమాద హెచ్చరిక!

ధవళేశ్వరం గోదావరిలో వరద ప్రవాహం ఎక్కువ కావడంతో బ్యారేజ్ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ అయింది.

Update: 2024-07-23 08:57 GMT

దిశ,రాజమహేంద్రవరం:ధవళేశ్వరం గోదావరిలో వరద ప్రవాహం ఎక్కువ కావడంతో బ్యారేజ్ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ అయింది. కాటన్ బ్యారేజ్ వద్ద 14.40 అడుగులకు నీటిమట్టం చేరింది. దీంతో ఇరిగేషన్ అధికారులు 175 గేట్లు ఎత్తి 13.72 లక్షల క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేసినట్లు ఇరిగేషన్ శాఖ అధికారులు తెలిపారు. మూడు పంట కాలువల ద్వారా 2,700 క్యూసెక్కుల సాగునీటిని విడుదల చేశారు.


Similar News