ఆ జిల్లాలో 26, 27న స్కూళ్లకు సెలవులు
ఏపీలోని కొన్ని జిల్లాలకు వరుసగా రెండు రోజులు స్కూళ్లకు సెలవు ప్రకటించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: ఏపీలోని కొన్ని జిల్లాలకు వరుసగా రెండు రోజులు స్కూళ్లకు సెలవు ప్రకటించారు. ఈ నెల 26న శివరాత్రి సందర్భంగా విద్యాసంస్థలకు పబ్లిక్ హాలిడే ఇచ్చారు. తర్వాత రోజు 27న ఏపీలో గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఏపీలోని ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ప.గో, తూ.గో, గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని స్కూళ్లకు సెలవు ప్రకటించారు.