పవన్ కల్యాణ్‌ను కలిసిన రష్యా వ్యోమగామి సెర్గి
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను రష్యా వ్యోమగామి సెర్గి కలిశారు.
దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను రష్యా వ్యోమగామి సెర్గి కలిశారు. ఆదివారం ఇండియా స్పేస్ కిడ్జ్ ప్రతినిధులతో కలిసి పవన్ కల్యాణ్‌తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఏపీలో స్పేస్ పార్క్ ఏర్పాటు చేయాలని పవన్‌ను కలిసిన బృందం కోరింది. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. అంతరిక్ష విజ్ఙానంపై అవగాహన అవసరమని అభిప్రాయపడ్డారు. విద్యార్థులను సైంటిస్టులుగా తయారు చేయాలని కోరారు. ఇందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంపూర్ణంగా సహకరిస్తుందని హామీ ఇచ్చారు.