రేవంత్ రెడ్డి, మోడీలను ప్రస్తావిస్తూ ఓటమిపై రోజా షాకింగ్ కామెంట్స్

ఏపీలో ఘోర పరాభవం తర్వాత వైసీపీ ఈవీఎం ట్యాంపరింగ్ అంశాన్ని లేవనెత్తిన విషయం తెలిసిందే.

Update: 2024-06-20 07:32 GMT

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలో ఘోర పరాభవం తర్వాత వైసీపీ ఈవీఎం ట్యాంపరింగ్ అంశాన్ని లేవనెత్తిన విషయం తెలిసిందే. మాజీ సీఎం జగన్ సైతం అభివృద్ధి చెందిన దేశాలలో పేపర్ బ్యాలెట్ ద్వారా ఓటింగ్ అవుతుందని ఇటీవల ట్వీట్ చేశారు. తాజాగా, మాజీ మంత్రి రోజా ఏపీలో తమ పార్టీ ఓటమిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కూటమికి అన్ని సీట్లు రావడం గురించి చిన్న పిల్లాడిని అడిగిన చెబుతారన్నారు.

ఏపీలో జగన్ ఇంత మంచి చేసి ప్రతి కుటుంబాన్ని తన కుటుంబంల భావించి పేదరికం నిర్మూలించే విధంగా పరిపాలించి రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసినా 11 సీట్లు రావడం ఏంటని సందేహం వ్యక్తం చేశారు. 40 శాతం ఓటింగ్‌తో తెలంగాణలో రేవంత్ రెడ్డి సీఎం అయ్యారని.. 40 శాతం ఓటింగ్‌తో మోడీ ప్రధాని అయ్యారన్నారు. 40 శాతం ఓట్లు వచ్చిన జగన్‌కు 11 సీట్లు రావడం ఏంటని ప్రశ్నించారు. గుమ్మడికాయల దొంగ అంటే టీడీపీ, జనసేన నాయకులు భుజాలు తడుముకుంటున్నారని ఫైర్ అయ్యారు.   


ఇక్కడ క్లిక్ చేయండి : Breaking News: అమరావతిలో సీఎం చంద్రబాబు పర్యటన.. నేరుగా అక్కడికే..


Tags:    

Similar News