RMC గ్రౌండ్ మూసివేత.. వాకర్స్‌కు అనుమతి ఇవ్వాలంటూ బైక్ ర్యాలీ

కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ గ్రౌండ్ ఇన్చార్జి డా.ఉమామహేశ్వర రావు పై దాడికి దిగిన నేపథ్యంలో గ్రౌండ్ మూసివేసారు.

Update: 2024-10-06 09:23 GMT

దిశ, కాకినాడ: కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ గ్రౌండ్ ఇన్చార్జి డా.ఉమామహేశ్వర రావు పై దాడికి దిగిన నేపథ్యంలో గ్రౌండ్ మూసివేసారు. దీంతో వాకర్స్ ఇబ్బంది పడుతున్న వైనంపై రంగరాయ మెడికల్ కాలేజ్ గ్రౌండ్‌లో వాకర్స్‌కు అనుమతి ఇవ్వాలని కోరుతూ రంగరాయ మెడికల్ కాలేజ్ గ్రౌండ్ వాకర్స్ అసోసియేషన్ వెల్ఫేర్ సొసైటీ కమిటీ కోరింది. ఆర్ఎంసి గ్రౌండ్స్ నుంచి ఆదివారం బైక్ ర్యాలీగా టూ టౌన్ మెయిన్ రోడ్డు మసీదు సెంటర్ జగన్నాధపురం బ్రిడ్జి మీదుగా ఎమ్మెల్యే వనమాడి ఇంటికి చేరుకున్నారు.

కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావుతో అసోసియేషన్ ప్రతినిధులు సుమారు అర్థగంట పాటు చర్చించారు. గత 25 సంవత్సరాలుగా ఈ గ్రౌండ్‌ను వాకర్స్ మట్టి, ఇసుక, మొక్కలు, లైట్లు వేసి ట్రాక్‌ను అభివృద్ధి చేశామని ఎమ్మెల్యేకు గుర్తు చేశారు. భవిష్యత్తులో ట్రాక్‌లో ఎటువంటి సంఘటనలు జరగకుండా అసోసియేషన్ వెల్ఫేర్ సొసైటీ కమిటీ బాధ్యత వహిస్తుందని హామీ ఇచ్చారు. అందుకని వెంటనే వృద్ధులు, మహిళలు ఇబ్బందులు పడుతున్నారని ఈ గ్రౌండ్ లో వాకింగ్ చేస్తే ఆక్సిజన్‌తో పాటు ఆరోగ్యంగా ఉంటారని కావున ఉదయం 4:30 నుండి 8:00 వరకు సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు అనుమతి ఇవ్వాలని కోరారు. అనంతరం ఎమ్మెల్యే వనమాడి ప్రిన్సిపాల్ ఇతర అధికారులతో మాట్లాడి అనుమతిచ్చేలా ప్రయత్నం చేస్తానన్నారు.


Similar News