Resignation: మాజీ సీఎం జగన్‌కు ఊహించని షాక్.. పార్టీకి మాజీ మంత్రి రాజీనామా
రాష్ట్రంలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ (YSRCP)కి రాష్ట్ర ప్రజలు చుక్కలు చూపించారు.
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ (YSRCP)కి రాష్ట్ర ప్రజలు చుక్కలు చూపించారు. ఆ పార్టీని కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితం చేస్తూ ఎవరూ ఊహించని తీర్పునిచ్చారు. దీంతో కూటమి ప్రభుత్వం అధికారాన్ని కైవసం చేసుకుంది. ఊహించని పరిణామంతో వైసీపీ (YSRCP)లో ఏదో తెలియని అనిశ్చితి నెలకొంది. గ్రామాల్లో బూత్ లెవల్ కార్యకర్తల నుంచి జిల్లా నాయకులంతా వరుసగా పార్టీలు మారుతున్నారు. ఇప్పటికే పలువురు మాజీ మంత్రులు (Former Ministers), ఎంపీ (MP's)లు, ఎమ్మెల్యే (MLA's)లు సైతం టీడీపీ (TDP), జనసేన పార్టీ (Janasena Party)ల తీర్థం పుచ్చుకున్నారు.
ణఈ క్రమంలోనే మాజీ సీఎం వైఎస్ జగన్ (YS Jagan)కు మరో బిగ్ షాక్ తగిలింది. విశాఖ జిల్లా (Vishakha District)లో కీలక నేతగా ఉన్న భీమిలీ (Bhimili) నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ ఇవాళ వైసీపీ (YCP)కి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు తన రాజీనామా పత్రాన్ని వైసీపీ అధిష్టానానికి పంపారు. వ్యక్తిగత కారణాలతో రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లుగా అవంతి ఆ లేఖలో పేర్కొన్నారు. అయితే, గత కొంతకాలంగా ఆయన పార్టీకి, పార్టీకి సంబంధించిన కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. త్వరలోనే ఆయన టీడీపీలో చేరబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన పలువురు కీలక నేతలతో అవంతి చర్చలు జరిపారని నియోజకవర్గంలో జోరుగా చర్చలు జరుగుతోంది.